- Advertisement -
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు జస్టిస్ సంతోష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూజానంతరం అద్దాల మండపంలో సంతోష్ రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, అధికారులు స్వామి వారి ప్రసాదం అందజేశారు.
- Advertisement -