బీజేపీ నేతలపై విమర్శలు..24 గంటల్లోనే జడ్జీ బదిలీ!

355
muralidhar
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లలో చనిపోయిన వారిసంఖ్య 27కు చేరుకోగా 250 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ అల్లర్లను నివారించడంలో పోలీసుల వైఫల్యం, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌పై బదిలీ వేటు పడింది.

అల్లర్లపై విచారణ చేపట్టిన మురళీధర్‌పై 24 గంటలు గడవకముందే పంజాబ్,హర్యానా హైకోర్టుకు బదిలీచేస్తూ న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మురళీధర్ బదిలీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

వాస్తవంగా కొలీజియం ఇదివరకే ఆయన బదిలీకి సిఫారసు చేయగా దీనిని సీజే రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ జరుగుతున్న సమయంలో బదిలీచేయడం వివాదాస్పదంగా మారింది. జస్టిస్ మురళీధర్ 1984 సెప్టెంబరులో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. 1987లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఢిల్లీకి మారారు. 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

- Advertisement -