జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 31 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 316.540 మీటర్లు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 6.004 టీఎంసీలు.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,50,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,40,999 క్యూసెక్కులుగా ఉండగా ఐదు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది.
భద్రాద్రిలో గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత రాత్రి నుంచి స్వల్పంగా తగ్గుతూ వచ్చింది ప్రవాహం. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48.90 అడుగులు కాగా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఎగువ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరికి భారీగా పెరిగింది వరద. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉండేది.
Also Read:జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!

