జూపల్లి వర్సస్ చింతలపల్లి..కొల్లాపూర్ వార్!

44
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణరావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన జూపల్లి… ఎన్నో వాయిదాల తరువాత కాంగ్రెస్ కండువా కప్పుడుకున్నారు. జూపల్లి రాకతో కొల్లాపూర్ నియోజిక వర్గంలో పార్టీ బలపడుతుందని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే అక్కడ జూపల్లి కృష్ణరావు పై ప్రజా వ్యతిరేకత ఉందని, సర్వేలు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ కారణాల చేతనే బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆయనను పక్కన పెట్టినట్లు కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు జూపల్లి కాంగ్రెస్ లో చేరడాన్ని ఏమాత్రం స్వాగతించడం లేదు..

తాజాగా హస్తం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి.. జూపల్లి కృష్ణరావు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు టి కాంగ్రెస్ లో దుమరాన్ని రేపుతున్నాయి. కొల్లాపూర్ లో కాంగ్రెస్ బలోపేతం కావడంపై జగధీశ్వరరావు పాత్ర చాలా ఉందని, అలాంటప్పుడు అక్కడ జూపల్లి పాత్ర ఏమీలేదని, ఆయన వల్ల పార్టీకి ఎలాంటి మేలు జరగదని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా జూపల్లి ప్రజల్లో ఉండే మనిషి కాదని చురకలంటించారు.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌కు మీరే రోల్ మోడల్స్:ఎంపీ సంతోష్

దీంతో టి కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. కాగా మొదటి నుంచి కూడా జూపల్లి కృష్ణరావు మరియు చింతలపల్లి జగదీశ్వరరావు మద్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనెంతల విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఒకరిపై ఒకరు బరిలో నిలిచిన సందర్భాలు ఉనన్యి ప్రస్తుతం ఇద్దరు కూడా కాంగ్రెస్ లోనే కనసాగుతున్నారు. అంతే కాకుండా ఇద్దరు కొల్లాపూర్ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే జూపల్లి కంటే ముందే చింతలపల్లి కాంగ్రెస్ లో చేరారు. అందువల్ల కొల్లాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని చింతలపల్లి జగదీశ్వర రావు ఆశిస్తున్నారు. మరి ఇద్దరు కూడా బలమైన నేతలే కావడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం తర్జన భర్జన పడుతోందట. మరి ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందో చూడాలి.

- Advertisement -