మిస్‌వరల్డ్ పోటీలతో పెట్టుబడులు:జూపల్లి

2
- Advertisement -

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పెట్టుబడులను ఆకర్షించవచ్చు అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి జూపల్లి, TGTDC చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జూపల్లి… సుమారు 140 దేశాల వారు ఇక్కడికి వస్తారు అన్నారు. ప్రపంచం దృష్టి మన రాష్ట్రంపై పడుతుంది.. అందాల పోటీ లు అంటే ఇంకో కోణంలో చూడొద్దు అన్నారు. ఇది ఎంతో మంది అమ్మాయిలకు, మహిళలకు, మనోధైర్యం, సంకల్పం ఇస్తుంది అన్నారు.

Also Read:హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్

- Advertisement -