పార్టీ మారే ఆలోచన లేదు: జూపల్లి

264
jupalli krishnarao
- Advertisement -

తనకు టీఆర్ఎస్ పార్టీ మారే ఆలోచన లేదని…సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తాను పార్టీ మారుతున్నట్లు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.

అసెంబ్లీ, స్థానిక, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఫలితాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలకు ఉనికి లేకుండా పోయిందన్నారు జూపల్లి. తాను పూటకో పార్టీని మార్చే వాడిని కాదన్నారు.

తనంటే గిట్టని కొంతమంది ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమదంతా టీఆర్‌ఎస్‌ కుటుంబమేనని తేల్చిచెప్పిన జూపల్లి… కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు.

- Advertisement -