నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ నిర్మాతగా, బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేధా థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం జైలవకుశ. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సినీ హీరో ఎన్టీఆర్ స్పందించారు.
చరిత్రలో నిలిచిపోయే పాత్రలో నటించాలని తాను అనుకున్నానని, ఈ సినిమాలో తను నటించిన జై పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ సినిమాకి డబ్బులు వచ్చాయా రాలేదా అన్నది తరువాతి విషయమని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి పాత్రలో నటించానన్న సంతృప్తి ఉంటుందని అన్నాడు.పగలు, రాత్రి కష్టపడి పనిచేసినందుకు మంచి స్పందన వచ్చిందని కల్యాణ్ రామ్ పేర్కొన్నాడు. తమ బ్యానర్‌లో వచ్చిన మొట్టమొదటి సినిమా కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని చెప్పాడు. ఈ కథకు తారక్ తప్ప ఎవరూ సరైన న్యాయం చేయలేరని అన్నాడు.