దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతి బాబు అన్న కూతురు పూజా జైపూర్ వివాహం చేసుకోనున్నారు. ఈవివాహ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. రాణా, నాని, ఎన్టీఆర్, రామ్ చరణ్, అందరూ ఎయిర్ పోర్టులో సందడి చేశారు.
వీరందరూ కలిసి ముచ్చటగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన చేతికి ఉన్న వాచ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ వాచ్ రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీదని తెలుస్తోంది.
ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు అత్యంత ఖరీదైన ఈ వాచ్ లను ధరిస్తుంటారు. ఆ వాచ్ ఖరీదు దాదాపు 2కోట్లకు పైనే ఉంటుందట. ఒక్క వాచ్ కసమే ఎన్టీఆర్ ఇంత డబ్బు పెట్టాడా అని అంటున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈవాచ్ ఎలా ఉందో చూసేందుకు చాలా మంది గూగూల్ లో వెతుకుతున్నారు.