బిగ్ బాస్ షో.. హిందీలో పాపులర్ షో.. అక్కడ పది సీజన్లు విజయవంతమైయ్యాయి. తాజాగా ఈ షో తెలుగులో ప్రారంభం కాబోతుంది. ఈ షోకు హోస్ట్‌గా చేయబోతున్నట్టు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇదే విషయాన్ని మంగళవారం ‘స్టార్ మా’ చానల్ అధికారికంగా ప్రకటించింది. స్టార్ మా చానల్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ ఈ షో గురించి మాట్లాడుతూ.. తెలుగులో అత్యంత భారీ స్థాయిలో ఈ బిగ్ బాస్ షోను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రారంభించనుండడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా ఈ షోను చేస్తున్నామన్నారు.
ఇక ఈ షో ఎలా ఉండబోతుంది.. రియాల్టీ షో అంటే ఏంటీ.. ఇందులో ఏం చేస్తారంటే.. ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు పన్నెండుమంది సెలబ్రిటీలను పంపి, తాళం వేసేస్తారు. వాళ్లకు అవసరమైన అన్ని వసతులూ కల్పిస్తారు. అయితే బయటి ప్రపంచంతో కానీ, సెల్‌ఫోన్ లు, టీవీలు, దినపత్రికలు వంటి మాధ్యమాలతో కానీ సంబంధం ఉండదు. ఆ ఇల్లే వారి ప్రపంచం. వాళ్ల ప్రతి కదలికను కెమెరాలు రికార్డ్ చేస్తుంటాయి. వాళ్ల నడవడికను, జీవన శైలిని ప్రేక్షకులు గమనిస్తుంటారు. భిన్న రంగాలకు చెందిన సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధంలేని ఆ చోట ఎలా ఉంటారనేదే ఆసక్తికర అంశం.
హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా రూపొందిన బిగ్ బిస్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2010 నుంచి దబాంగ్ ఖాన్ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్ నుంచి ఇప్పటివరకు వరుసగా సల్మానే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి ఎంత పాపులారిటీ వచ్చిందంటే.. అప్పటి వరకు ట్రెండింగ్‌గా ఉన్న పలు సెలబ్రెటీ షోలను సైతం వెనక్కి నెట్టి బిగ్‌బాస్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఇప్పటికీ దూసుకెళ్లింది
బిగ్ బాస్ షో తెలుగు చరిత్రలోనే అతిపెద్ద షోగా నిలిచిపోతుందని ఎన్టీఆర్ అన్నారు. ఈ షోకు హోస్ట్‌గా చేయమని స్టార్ మా వాళ్లు అడిగినపుడు ఆసక్తిగా అనిపంచిందని.. ఈ షో తప్పకుండా గేమ్ ఛేంజర్ అవుందన్నారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న బిగ్ బాస్ షోకి ఛానెల్ యాజమాన్యం భారీగానే ముట్టజెపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక్క సీజన్ కి దాదాపు 7 కోట్ల వరకు చెల్లించనున్నట్టు టాక్. మరి వెండితెరపై స్టార్ డం పొందిన ఎన్టీఆర్ బుల్లి తెరపై ఎలా సందడి చేస్తాడో చూడాలి.