తాత సమాధిపై పూలు పెట్టరా.. ఇకపై మొత్తం నేనే చూసుకుంటాః ఎన్టీఆర్

340
Junior-ntr-Disappointed-For-Senior-Ntr-Jayanthi-Celebrations

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు పలువురు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మనువళ్లు తారక్ రామ్, కళ్యాణ్ రామ్ లు ఉదయం వచ్చి నివాళులు అర్పించారు. అయితే వాళ్లు వచ్చే సరికే సమాధిపై పూలు కూడా పెట్టకపోవడంతో ఎన్టీఆర్ అక్కడున్న కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఘాట్ ను పూలతో అలంకరిస్తారు. అయితే ఈసారి ఒక్క పువ్వు కూడా పెట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. వెంటనే అక్కడున్న తన అనుచరులతో పూలు తెప్పించి ఘాట్ పై చల్లారు కళ్యాణ్‌ రామ్, ఎన్టీఆర్. అనంతరం ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం మిడియాతో మాట్లాడిన ఎన్టీఆర్ ఇక పై తాత జయంతి వర్ధంతి వేడుకల ఏర్పాట్లు తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించారు ఎన్టీఆర్.