- Advertisement -
టాలీవుడ్‌లో మరో వారసుడు తెరంగేట్రం చేయనున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది అయిన నార్నే నితిన్ చంద్ర హీరోగా వెండితెర మీదకి రాబోతున్నాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతికి తమ్ముడైన నితిన్ చంద్ర హీరోగా రాబోతున్నాడని ఏడాదిగా వినిపిస్తూనే ఉండగా తాజాగా తన సినిమా ఫస్ట్ లుక్ వదిలి అటెన్షన్ క్రియేట్ చేశాడు.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలవగా తాజాగా వదిలిన ఫస్టులుక్ పోస్టర్ తో ఇది ఇంకాస్త పెరిగింది.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి అశోక్ గల్లా హీరోగా పరిచయం కాగా ,దగ్గుబాటి నుండి రానా తమ్ముడు అభిరాం కూడా త్వరలోనే హీరోగా రానున్నాడు.
- Advertisement -