అదిలేకపోతే ఉండలేను:ఎన్టీఆర్

225
ntr select mobiles
- Advertisement -

హ్యాట్రిక్‌ హిట్ సినిమాలతో మంచి జోష్ మీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. తాజాగా సెలక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్‌ టైగర్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ హైదరాబాద్‌లో మీడియాతో ఆసక్తికర
విషయాలు పంచుకున్నాడు.

సెల్‌ ఫోన్ ఎప్పుడూ తన వెంటే ఉంచుకుంటానని…ఫోన్ లేకుండా ఉండటం సాధ్యం కాదన్నారు. స్మార్ట్ ఫోన్ అని కాదు కనీసం మాట్లాడటానికైన ఫోన్ కావాలన్నారు. తనకు ఫోన్ నెంబర్లు పెద్దగా గుర్తుండవని….సన్నిహితులవే గుర్తుంటాయన్నారు.

నాని మంచినటుడని బిగ్ బాస్ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంటుందన్నారు. ఫొటోలకు పోజులివ్వడం నచ్చదని… ఫొటో షూట్‌ అంటే పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తుందన్నారు. మంచి ఆలోచనలతో మనసు నిండిపోతే సంతోషంగా ఉండగలమని…అందమైన కుటుంబం,పిల్లలు,అభిమానులు,స్నేహితులు తనని సంతోషంగా ఉంచుతున్నారని చెప్పారు.

- Advertisement -