రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె రెండోరోజుకు చేరుకుంది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు.
ఎమర్జెన్సీ సేవలు మినహా ఓపీ, ఐపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గాంధీ, ఉస్మానియా, కాకతీయతోపాటు రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కాలేజీల ముందు భైఠాయించి నిరసన తెలిపారు.
జూడాలు తమ ఎనిమిది డిమాండ్లను మంత్రి ముం దుంచారు. చ మంత్రి కొన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని .. స్టైపెండ్ చెల్లింపునకు గ్రీన్‌చానల్‌పై మరోమారు చర్చించి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు జూడాల ప్రతినిధులు తెలిపారు.
Also Read:యోగా…ఈజీ ఆసనాలివే!