జూన్‌లో వస్తున్న’జూన్ 143′..

232
June 143 Movie Teaser Launch
- Advertisement -

ఆదిత్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య‌, రిచా హీరో హీరోయిన్లుగా భాస్క‌ర్ బంటుప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43` . ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. నిర్మాత ల‌క్ష్మి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. అలాగే సాంగ్ ప్రోమోస్ కూడా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేశాన‌ని, కొన్ని సంద‌ర్భాల్లో సినిమాను ఆపేద్దామ‌ని కూడా అనుకున్నాను. కానీ టీం అందించిన స‌పోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాను మంచి విజువ‌ల్స్‌తో పిక్చ‌రైజ్ చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బంటుప‌ల్లి సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ స‌హా నటీన‌టులు, టెక్నిషియ‌న్స్ ఎంతో స‌పోర్ట్‌చేశార‌ని నిర్మాత ల‌క్ష్మి తెలిపారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో మంచి రోల్ చేశాను. భాస్క‌ర్‌ సినిమాను ఆద్యంతం ఎంతో చ‌క్క‌గా తెర‌కెక్కించారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అందించిన స‌హాకారంతో సినిమాను పూర్తి చేయ‌గ‌లిగామ‌ని హీరో ఆదిత్య అన్నారు.

June 143 Movie Teaser Launch

నిర్మాత‌ ల‌క్ష్మి లేకుంటే ఈ సినిమా లేదు. ఆవిడ అందించిన స‌పోర్ట్‌తోనే సినిమాను చేయ‌గ‌లిగాను. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వేణు కూడా తోడ్పాటునందించారు. నేను షార్ట్ పిలిం ద‌ర్శ‌కుడిని నేను డైరెక్ట్ చేసిన షార్ట్ మూవీని చూసిన ల‌క్ష్మికి షార్ట్ ఫిలిం న‌చ్చ‌డంతో సినిమా చేద్దామ‌ని అన్నారు. నేను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించారు. న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రం క‌ష్టంతో ఇష్ట‌ప‌డి చేసిన ఈ సినిమాను టైటిల్‌కు త‌గిన‌ట్టుగానే జూన్‌లోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నామ‌ని ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ బంటుప‌ల్లి చెప్పారు. లైన్ విన‌గానే సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా అంద‌ర్నీ ఎంటర్ టైన్ చేసే స‌బ్జెక్ట్ అని సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి అన్నారు.

ఆదిత్య‌, రిచా, వేణు, సాయి, బ‌న్ను, కాశీవిశ్వ‌నాథ్‌, మ‌ధుమ‌ణి, అరుణ్, తోట‌ప‌ల్లి మ‌ధు, కేధార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఎడిట‌ర్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌, కెమెరాః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, మ్యూజిక్ః శ్ర‌వ‌ణ్‌, నిర్మాతః ల‌క్ష్మి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బంటు ప‌ల్లి.

- Advertisement -