జూన్ 14..ఎస్సై, కానిస్టేబుల్‌ ధ్రువపత్రాల పరిశీలన

42
- Advertisement -

టీఎస్‌ఎల్‌పీఆర్బీ నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఇటీవల తుది రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల జూన్‌ 14 నుంచి 26వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్టు తెలిపింది. వీటికి సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లు జూన్‌ 11 ఉదయం 8గంటల నుంచి జూన్‌ 13వ తేదీ వరకు రాత్రి 8గంటల వరకు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులకు సూచించింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,09,906మంది సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల వివరాలను విడుదల చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 యూనిట్లను కూడా ప్రకటించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం అభ్యర్థులకు ఉన్న రిజర్వేషన్ ఆధారంగా కటాఫ్ మార్కులను బోర్డు నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా త్వరలో మెరిట్‌ లిస్ట్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.

Also Read: CMKCR:కులవృత్తి దారులకు ఆర్థిక సాయం…

మెరిట్‌ లిస్ట్‌లో పేరు ఉన్న వారు మెడికల్ టెస్టు నిర్వహించి..ఎస్బీ ఎంక్వైరీ చేస్తారు. ఈ క్రమంలో క్రిమినల్ కేసులు ఉన్నవారిని ఈ పోస్టులకు అనర్హులుగా పరగణిస్తారు. మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టి ఎంపికైన అభ్యర్థులతో తుది ఫలితాలు విడుదల చేస్తారు. దీంతో పాటుగా శిక్షణా షెడ్యూల్‌ను వారి లాగిన్‌లో పొందుపరుస్తామని బోర్డు వెల్లడించింది.

Also Read: సీఎం కేసీఆర్ వరాల జల్లు..వికలాంగులకు పెన్షన్‌ పెంపు

- Advertisement -