మిర్చి బజ్జిలు మన తెలుగు వారికి ఎంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రోడ్ పక్కన బండిపై వేడి వేడి గా నూనెలో వేగిన మిర్చి బజ్జీలను తినకుంటే ఆ రోజు ఏదో అసంపూర్ణంగా ఉంటుంది. స్నాక్స్ లలో ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్ మిర్చి బజ్జీలు అనే చెప్పవచ్చు. ఇక ఇంట్లో కూడా ప్రతిరోజూ స్నాక్స్ రూపంలో మిర్చి బజ్జీలను చేసుకుంటూ ఉంటారు చాలమంది. అయితే ఈ మిర్చి బజ్జీలలో చాలా రకాలే ఉన్నాయి. వాటిలో జంబో మిర్చి బజ్జీలు కూడా ఒకటి… వీటినే రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో మిర్చి బడా అని కూడా అంటారు. వీటిలో వాడే స్టాఫ్ మరియు ఇంగ్రిడియన్స్ ఈ బజ్జీలకు ఆ పేరును తీసుకొచ్చాయి. అయితే వీటిని మన ఇంట్లో కూడా చాలా చక్కగా ఎంతో క్రిస్పీ గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం !
ముందుగా స్టాఫింగ్ కోసం ఒక స్టవ్ పై ఫ్యాన్ ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేడి చేయాలి. ఆ తరువాత వేడి అయిన ఆయిల్ లో అరా టీ స్పూన్ జీలకర్ర, అరా టీ స్పూన్ దనియాలు నలిపి వేయాలి. వీటితో పాటు అరా టీ స్పూన్ సొంపు కూడా యాడ్ చేయాలి. ఆ తరువాత మిశ్రమం కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేడి చేయాలి. అప్పుడు ఈ మిశ్రమంలో అరా కప్పు ఇంగువా, అరా కప్పు పచ్చి మిర్చి ముక్కల తరుగు వేయాలి.. ఈ మిశ్రమం కాస్త వేగనిచ్చిన తరువాత అరా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తరువాత అరా టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఉప్పు తగినంతా వేసి మిశ్రమాన్ని బాగా కలిపి వేగనివ్వాలి. ఆ తరువాత అంచుర్ పొడి అరా టీ స్పూన్ వేస్తే ఈ మిశ్రమం మరింత రుచిగా మారుతుంది. ఒకవేళ అంచుర్ పొడి లేకపోతే కాసింత నిమ్మరసం యాడ్ చేసిన సరిపోతుంది. .
ఇప్పుడు ఈ మిశ్రమం లో మెత్తగా ఉడికించిన మూడు బంగాళదుంప గడ్డలను వేసి ఉప్మా మాదిరి మెత్తగా మెదపాలి. ఆలు ను మెత్తగా మేడిపిన తరువాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి.. జంబో సైజ్ పచ్చి మిర్చి లను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి అంచున కొద్దిగా కట్ చేసి నిలువుగా మద్యన చీరి లోపల ఉన్న గింజలను తీసివేయాలి. ఆ తరువాత ముందుగా తయారు చేసిపెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని చిరిన పచ్చి మిర్చి మద్యలో ఉంచాలి. ఆ తరువాత బజ్జీల పిండి కోసం ఒకటిన్నర కప్పు శనగ పిండి తీసుకోవాలి. ఈ శనగ పిండిలో ఉప్పు తగినంత వేసి ఒక టీ స్పూన్ వంట సోడా, అరా టీ స్పూన్ వాము నలిపి వేయాలి. ఆ తరువాత తగినంతా నీళ్ళు పోసుకుంటూ శనగపిండి రంగు మరెంత వరకు బాగా కలపాలి. శనగపిండి రంగు మరి ఫ్లాఫీగా అయిన తరువాత ఒక గ్లాస్ లేదా బౌల్ లోకి తీసుకొని ముందుగా తయారు చేసిపెట్టుకున్న ఆలు మిశ్రమం కల్గిన జంబో మిర్చిలను తొడిమే దాకా ముంచి వేడి వేడి నూనెలో వేయాలి. ఆ తరువాత బజ్జి కాస్త గోదుమ రంగులోకి మారిన తరువాత పాత్రలోకి తీసుకోండి. ఇలా చేయడం వల్ల జంబో మిర్చి బజ్జీలు ఎంతో రుచిగా కృస్పిగా తయారు అవుతాయి. సాయంత్రం పూట చక్కటి స్నాక్స్ గా వీటిని తయారు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి…