బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులుగా ఎన్నికైన జూలురు గౌరీశంకర్‌

103
- Advertisement -

తెలంగాణ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో 2022–23వ సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించారు.

నూతన అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక కావడం ఇది వరుసగా నాలుగోసారి. ఉపాధ్యక్షులుగా కోయ చంద్రమోహన్, పి నారాయణ రెడ్డి, కార్యదర్శిగా శృతికాంత్ భారతి, సహాయ కార్యదర్శిగా శోభన్ బాబు, కోశాధికారిగా పి రాజేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కవి యాకూబ్, ఎన్ మధుకర్, బి నర్సింగ్ రావు, ఏ జనార్దన్ గుప్తా, విజయరావు, కె బాల్ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. మాటూరి సూర్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

- Advertisement -