న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి: సీజేఐ రమణ

88
ramana
- Advertisement -

న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు సీజేఐ రమణ. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రమణ… తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడించారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ వచ్చిందని చెప్పారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు. చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్‌ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు.

- Advertisement -