24 వరకు ప్రజ్వల్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ

11
- Advertisement -

కన్నడ నాట సంచలనం రేపిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులలో జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది బెంగళూరు కోర్టు. జూన్‌ 24 వరకూ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం స్పాట్‌ విచారణను పూర్తి చేయడంతో తదుపరి కస్టడీని కోరలేదు. హోలోనర్సిపూర్‌ ఉన్న ప్రజ్వల్‌ ఇంట్లో సిట్‌ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఆ సమయంలో సిట్‌ అధికారుల వెంట ప్రజ్వల్‌ కూడా ఉన్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

కర్ణాటకలో ఎన్నికల్లో జేడీఎస్ రెండు స్థానాల్లో గెలుపొందగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కుమారస్వామి.

Also Read:నూకాంబికా అమ్మవారి సన్నిధిలో పవన్

- Advertisement -