లోకాయుక్త జస్టిస్‌పై కత్తితో దాడి..

173
- Advertisement -

కర్ణాటక లోకాయుక్త కోర్టులో కలకలం చోటుచేసుంది. లోకాయుక్త జస్టిస్‌ విశ్వనాథ్‌ షెట్టిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. కేసు విచారణకు హాజరైన తేజస్ శర్మ అనే యువకుడు జస్టిస్ విశ్వనాథ్ ను ఆయన  కార్యాలయంలోనే  కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో మూడు సార్లు ఆయనపై దాడి చేయగా ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.

విశ్వనాథ్‌ కడుపులో,చేతిపై కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు ప్రాణాపాయం తప్పినట్లు, ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు కోర్టుకు ఎందుకువచ్చాడు ,జస్టిస్‌పై దాడి చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Judge stabbed in the court

మరోవైపు జస్టిస్ విశ్వనాథ్‌పై దాడిని సీఎం సిద్దరామయ్య తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో విశ్వనాథ్‌ని పరిశిలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్ధితి ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదహరణ అని చెప్పారు. జస్టిస్‌ పై దాడి నేపథ్యంలో కర్ణాటక లోకాయుక్త కోర్టులో కలకలం చోటుచేసుకుంది.

- Advertisement -