- Advertisement -
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ రోజున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Also Read:గ్రీన్ ఇండియా ఛాలెంజ్..విప్లవాత్మక అడుగు
- Advertisement -

