- Advertisement -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. అలాగే పలువురు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శకుడు రాజమౌళి. షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్-28లో ఓటు వేశారు రాజమౌళి దంపతులు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని… ఏర్పాట్లను పరిశీలించడానికే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాను అన్నారు. మొదటి 45 నిమిషాలలోనే దాదాపు 70 నుంచి 100 ఓట్లు పోలయ్యాయి అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.
Also Read:ఢిల్లీలో బాంబు పేలుడు..8 మంది మృతి
- Advertisement -

