జనతా గ్యారేజ్ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసింది ’జనతా గ్యారేజ్’. బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. జనత గ్యారేజ్ తర్వాత తీసే సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉండాలని జూనియర్ భావిస్తున్నాడట.
ప్రస్తుతం ఎన్టీఆర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈసినిమాకు టైటిల్‌ను ‘జై లవ కుశ’గా పెట్టునున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలో కనిపించనున్నాడట.
తాజాగా ఈసినిమాకు సంబంధించి పలు విషయాలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈసినిమాకి సంబంధించిన దర్శకుడు బాబి ఒక తమిళ చిత్రం ఆధారంగా ఈసోర్టీ వ్రాసాడని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరందుకున్నాయి. పది సంవత్సరాల క్రితం కోలీవుడ్‌లో విడుదలైన ‘వరలారు’ అనే మూవీ కథ ఆధారంగా ఈ సినిమాను తీయనున్నారట. ‘వరలారు’ అనే సినిమాలో అజిత్ హీరోగా నటించాడు. 2006లో విడుదలైన ఈసినిమా అప్పట్లో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ మూవీలో అజిత్ కూడా మూడు పాత్రలతో నటించాడు.
తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ కూడా ఈసినిమాలో మూడు పాత్రల్లో నటించనున్నాడు. అయితే ఈమూడు క్యారెక్టర్ల విషయం కూడా తెలిసిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్విన్స్ గా కనిపిస్తాడట. మూడవ పాత్ర ఏమిటంటే ఆ రెండు పాత్రలకి తండ్రిగా ఉంటాడని తెలుస్తోంది. మొత్తం మీద దర్శకుడు బాబి జూనియర్ సినిమా కోసం రిమేక్ కథను బాగానే రెడీ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. మరీ ఈసినిమాపై వస్తున్నా గాసిప్స్‌పై చిత్రయూనిట్ ఇంత వరకు కూడా స్పందించలేకపోవడంతో ఈవార్తలు నిజంమే కావచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగ ఈసినిమాకు సంబంధించి రెగ్యూలర్ షూటింగ్ నిన్నటినుంచి ప్రారంభంమైంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తున్న వారి సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.