ఊరమాస్‌ నుంచి క్లాస్‌ లుక్‌…!

216
Jr.NTR's Lava poster is out
- Advertisement -

‘యంగ్‌టైగర్‌’ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జైలవకుశ’. బాబి దర్శకుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’అనే మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు.

ఇటీవల జై పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌ విడుదలైన 48 గంటల్లోనే రికార్డులు సృష్టించింది.చిత్ర యూనిట్ రాఖీ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 7 న ల‌వ కుమార్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Jr.NTR's Lava poster is out

చిత్రబృందం చెప్పినట్టుగానే… తాజాగా ఈ సినిమాలోని మరో పాత్ర లవను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రెండు పోస్టర్స్‌ను విడుదల చేసింది. ఈ రెండు పోస్టర్స్‌లో ఎన్టీఆర్ చాలా కూల్‌గా ఉన్నాడు.

జై పాత్రలోని నెగిటివ్ షేడ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించిన బాబీ.. లవకుమార్ పాత్రను మాత్రం అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. లవకుమార్ పాత్రలో ఎన్టీఆర్ చాలా కూల్‌గా, ఎటువంటి హడావుడి లేకుండా కనిపించాడు.

Jr.NTR's Lava poster is out

బృందావనం సినిమా తర్వాత మరోసారి లవను లవర్ బాయ్‌గా చూపించడంలో దర్శకుడు బాబీ సఫలీకృతుడయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ జైలవకుశను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే మరో నందమూరి హీరో బాలకృష్ణ సినిమా పైసా వసూల్ కూడా సెప్టెంబర్ 1న విడుదల కానుండం విశేషం. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టగలిగితే నందమూరి అభిమానులకు పండగేనని చెప్పక తప్పదు

- Advertisement -