వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తుండగా అలాగే బాలీవుడ్‌లో వార్ 2లో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా నుండి అప్‌డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో తారక్ లైవ్ లుక్ కి – ఫ్లాష్ బ్యాక్ లుక్ కి చాలా వేరియేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని.. ముఖ్యంగా ఈ ఫ్లాష్ బ్యాక్ చాలా షార్ప్ కట్టింగ్ తో విజువల్ వండర్ గా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
Also Read:వైరల్ వీడియో…రిలీజ్ చేసిన ఆర్మీ

