పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న మరో పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా సోషల్ మీడియాలో ప్రకటించారు. 2024 మే 9న కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సంక్రాంతి వేళ ఇవాళ థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు కల్కి సినిమా డేట్ ను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ లో సందడి చేశారు. అటు సంక్రాంతి వేళ కావడం, ఇటు విడుదలైన కొత్త సినిమాలతో పాటు కల్కి రిలీజ్ డేట్ ను థియేటర్లలో రిలీజ్ చేయడం.. మొత్తానికి పండగ వాతావరణాన్ని తలపించింది.
ఈ క్రమంలోనే కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి మాస్కులు వేసి థియేటర్లలో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘కల్కి 2898 ఏడీ’ అంటూ టైటిల్ కూడా చాలా డిఫెరెంట్ గా పెట్టారు. పైగా ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేనా.. అటు అమితాబ్ బచ్చన్, మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ లు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాబట్టి, ఈ సినిమా పై మొదటి నుంచి సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎక్కువ ఆసక్తి నెలకొంది. అన్నట్టు కమల్ హాసన్, అమితాబ్ లతో పాటు రానా, మరో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలో దుల్కర్ నటిస్తే.. మలయాళంలో కూడా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ముఖ్యంగా కల్కి సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంటే.. కచ్చితంగా ఆ డైలాగ్స్ కూడా బాగా పేలతాయి.
Also Read:KTR:బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీ టీం కాదు