భద్రాద్రిలో ఎన్టీఆర్..తిరుమలలో పద్మావతి

240
Jr NTR Visited Bhadrachalam
- Advertisement -

సినీనటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. శుక్రవారం సతీసమేతంగా భద్రాద్రికి చేరుకున్న ఎన్టీఆర్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం అధికారులు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందించి ఆలయ విశేషాలు వివరించారు.

దసరా కానుకగా విడుదలైన జై లవకుశ ఘన విజయం సాధించింది. బాల నటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ రామాయణం చిత్రంలో నటించారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా కుటుంబ సభ్యులతో కలిసి రాములవారి సేవలో పాల్గొన్నారు.

Jr NTR Visited Bhadrachalam
ఇక తిరుమల శ్రీవారిని బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొనె దర్శించుకున్నారు.  వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.దీపికను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

దీపిక నటించిన ‘పద్మావతి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌పుట్‌ ల చరిత్ర ఆధారంగా సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపికా వెంట దర్శకురాలు ఫరా ఖాన్‌ కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. కాగా వివాదాలతో నిత్యం వార్తల్లో నలుగుతున్న పద్మావతి  మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Jr NTR Visited Bhadrachalam

- Advertisement -