కార్తికేయ స్వామిగా తారక్!

10
- Advertisement -

విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్డమ్” సినిమాను ప్రమోట్ చేస్తూ, నిర్మాత నాగ వంశీ తన రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను షేర్ చేశారు. అదే జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌తో కలసి రూపొందించబోయే సినిమా.

ఈ ప్రాజెక్టుపై మాట్లాడుతూ నాగ వంశీ మాట్లాడుతూ.. నితేశ్ తివారి రూపొందిస్తున్న “రామాయణం” ప్రకటన వీడియో చూసిన తర్వాత త్రివిక్రమ్ తన మైథలాజికల్ సినిమాను మరింత గొప్పగా, విస్తృత స్థాయిలో ప్రకటించాలనే ఉద్దేశంతో అనౌన్స్‌మెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ స్వామి పాత్రలో కనిపించనున్నారని, ఇది ఓ పవర్‌ఫుల్, భావోద్వేగభరితమైన పాత్రగా ఉండబోతుందని సమాచారం.త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం విడుదలైన వెంటనే 2026లో ఈ మైథలాజికల్ మూవీ షూటింగ్ మొదలవుతుందని నాగ వంశీ వెల్లడించారు.

Also Read:రేవంత్ రెడ్డి..బఫూన్: జగదీశ్‌ రెడ్డి

- Advertisement -