తారక్ స్వీట్ రిక్వెస్ట్

21
- Advertisement -

ఎన్టీఆర్ 30 సినిమా ఎనౌన్స్ మెంట్ నుండి ఎలాంటి అప్ డేట్ లేకుండా ఫ్యాన్స్ ను వెయిట్ చేస్తున్నాడు తారక్ . కొరటాల కూడా సోషల్ మీడియాలో లేడు. షూటింగ్ వెళ్లకముందే సినిమా క్యాన్సిల్ అనే రూమర్స్ బాగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌజ్ మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా తారక్ ఈ విషయంపై తారక తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు.

తన భార్య కంటే ముందు అభిమనులకే అప్ డేట్ చెప్తానంటూ మాట్లాడాడు. ఇక ప్రొడక్షన్ హౌజ్ మీద అప్ డేట్స్ అంటూ ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదని అన్నాడు. ఫిబ్రవరిలో పూజ ప్రారంభం కానుందని , మార్చ్ 20 నుండి లేదా ఆ లేపే షూటింగ్ మొదలవుతుందని , ప్రకటించినట్లే వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని తెలిపాడు.

ఇక కంటిన్యూ గా సోషల్ మీడియాలో అప్ డేట్స్ అంటూ అడుగుతున్న అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ తనే అప్ డేట్స్ చెప్పేసి ఇక సైలెంట్ గా ఉండలంటూ కోరుకున్నాడు. ఏదేమైనా అభిమానులు అప్ డేట్స్ కోసం ఎదురుచూడటం తప్పేం కాదు. వారి అభిమానం అలాంటిది. ఇక హీరోలు , దర్శకనిర్మాతలు కూడా ఫ్యాన్స్ ను ఎక్కువ వెయిట్ చేయనికుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇచ్చేస్తే బెటర్. కోలీవుడ్ స్టార్ హెరోల సినిమాలకు సంబంధించి ఓపెనింగ్ కి ముందే అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. విజయ్ ‘లియో’ సినిమా ఎనౌన్స్ మెంట్ వీడియో , కాస్టింగ్ , మ్యూజిక్ ఇలా అన్నీ అప్ డేట్ ఇచ్చేశారు. మరి తెలుగు స్టార్స్ ఎందుకో ఆ విషయంలో అభిమనులని ఇబ్బంది పెడుతూ వారు ఇబ్బంది పడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -