ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ అంశంపై చర్చకు వచ్చింది. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి సారించారు. అందుకే జైల్లో ఉన్న బాబును పరామర్శించాలన్నా, వైఎస్ఆర్సీ, జగన్ వైఖరిని ఖండించినా ఎన్టీఆర్ పట్టించుకోలేదు.
కావాలనే కొంతమంది ఎన్టీఆర్‌ను చంద్రబాబు సైడ్ చేశారని చెబుతుండగా , మరికొంతమంది మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ వెళ్తున్నారని వాదించారు. అయితే ఎన్టీఆర్ తటస్థంగా ఉన్నారని, ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.
అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని ఘాట్ వద్ద అభిమానులు ఆయనను కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతిస్తుండటంతో చంద్రబాబు..ఎన్టీఆర్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఎన్టీఆర్‌ను లోకేష్ కోసమే పక్కకు జరిపారని వాదన వినిపిస్తుండగా మొత్తంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలను భట్టి చూస్తే ఎన్టీఆర్ టీడీపీకి దూరమైనట్లేనని అంతా భావిస్తున్నారు. ఏదిఏమైన ఎన్టీఆర్…ప్రస్తుతం దేవర సినిమాతో పాటు వార్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Also Read:KTR:రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా?లేనట్టా..?