టాలీవుడ్ లోనే కాదు.. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ విషయంలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా నైన్ నెంబర్ కోసం వెంపర్లాడేవాళ్లు చాలామందే ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సిన వారు నందమూరి ఫ్యామిలినే
తెలుగు ప్రజలకు నందమూరి కుటుంబంతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారి గురించి పరిచయం ఉన్న వారిలో సైతం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఒకటుంది. అదేమిటంటే నందమూరి ఫ్యామిలికీ నెంబర్ నైన్ (9) తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. తోమ్మిది తన అదృష్ట సంఖ్యగా నటరత్న ఎన్టీఆర్ భావించే వారు. అందుకే నందమూరి వంశంలో నాటి తరం నుంచి ఈ తరం వరకూ అందరికీ తొమ్మిది అంటే మక్కువ ఎక్కువ. ఎన్టీఆర్ వారసత్వంగా నటనను కొనసాగించటమే కాకుండా.. తాము కొనే కార్లకు ఆయనకు ఇష్టమైన తొమ్మిదో నంబర్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు నందమూరి ఫ్యామిలీ హీరోస్…
నటరత్న ఎన్టీఆర్… తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా భావించేవారు. అందుకే ఆయన తన కార్లకు 0999 లేదంటే 9999 నంబర్లను తీసుకునేవారు. ఆయన నట వారసుడు నట సింహ బాలకృష్ణ కూడా తొమ్మిది సెంటిమెంట్‌ను కొనసాగించారు. బాలకృష్ణ తన కార్లకు ఎక్కువ 9999 అనే నంబర్లను వాడారు. కొని సందర్భల్లో 1234 అనే నెంబర్లను కూడా తీసుకున్నారు బాలకృష్ణ.
తనకు ఇష్టమైన బీఎండబ్ల్యూ 7సిరీస్ కారు కొనుగొలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ కారు నెంబర్ 9999కోసం పడిన తపన అంతా ఇంతా కాదు. ఆర్టీఏ శాఖ నిర్వహించిన వేలంలో పోటీ పడి మరీ…. తనకెంతో ఇష్టమైన నెంబర్ టీఎస్ 09ఈఎల్9999ను దక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ నెంబర్ కోసం ఏకంగా రూ.10.50లక్షలు ఖర్చు పెట్టరట.
అయితే తాజాగా ఎన్టీఆర్ మరో మనవడు తారకరత్న సైతం.. తొమ్మిది నంబర్ సెంటిమెంట్‌ను కొనసాగించేందుకు ఎంతో తపన పడ్డాడు. హైదరాబాద్‌లో ఉండే తారకరత్న.. తనకెంతో ఇష్టమైన ‘9999’ నంబరును సొంతం చేసుకునేందుకు.. గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన.. ఆన్ లైన్ బిడ్‌లో పాల్గొని.. తనకిష్టమైన నంబరును సొంతం చేసుకున్నాడు. ఇందుకోసం తారకరత్న 5 లక్షల రూపాయలు చెల్లించాడట.
మొత్తం మీద చెప్పుకొవాలంటే నందమూరి కుటుంబం 9నెంబర్ని విపరీతంగా వాడేస్తున్నారు.