- Advertisement -
గద్దర్ అవార్డులపై జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్పందించారు. ‘దేవర’ చిత్రానికి గాను గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కినందుకు అభినందనలు తెలిపారు ఎన్టీఆర్.
‘పుష్ప 2’లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఎంపికైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్.అలాగే ఉత్తమ చిత్రం ‘కల్కి’కి అవార్డు దక్కినందుకు కృతజ్ఞతలు తెలిపింది వైజయంతీ మూవీస్.
తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు … ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నా అన్నారు అల్లు అర్జున్. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు…క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలు, పుష్ప టీందే.. ఈ అవార్డును ఫ్యాన్స్‌కు అంకితమిస్తున్నా అన్నారు.



- Advertisement -

