ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి బాబు?

32
- Advertisement -

చంద్రబాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో తెలియదు గానీ, తెలుగు తమ్ముళ్ల మనస్సులో పెద్ద చిచ్చే రగిలిస్తోంది. ముఖ్యంగా బాబు అరెస్ట్‌పై నోరు మెద‌ప‌ని జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు తమ్ముళ్లు విరుచుకు పడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల్లో అందరూ క‌ట్ట క‌ట్టుకుని ముందుకు వచ్చి మరీ బాబుకు మద్దుతు పలుకుతున్నారు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప. నిజానికి బాబు అరెస్ట్ అయితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది అంటూ లోకేష్ టీమ్ భారీ డైలాగ్ లు కొట్టింది. కానీ, ఏపీలో అల్లకల్లోలం కాదు కదా, సాధారణ స్పందన కూడా కరువు అయ్యింది. ఆ స్థాయిలో జగన్ తన బలంతో బలగంతో తెలుగు తమ్ముళ్లను అణిచివేశాడు.

మరి లోకేష్ ఏం చేస్తున్నట్లు ?, అటు బాలయ్య బాబు ఏం చేస్తునట్టు ?, ఇక్కడ తెలియడం లేదా ?. సరైన సమర్ధుడు లేకపోతే.. పార్టీకి పుట్టగతులు ఉండవు అని. మరి అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టడం దేనికి ?, ఏ.. ఎన్టీఆర్ ఎందుకు సంపోర్ట్ చేయాలి ?, లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సీనియర్. పైగా సమర్ధుడు. అన్నిటికీ మించి తెలుగు దేశం పార్టీ కోసం ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ను తమకు అధికారం రాగానే తొక్కేశారు. అతని సినిమాలను చూడొద్దు అంటూ మెసేజ్ లు పాస్ చేశారు.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాలివే

అంతెందుకు ?, ఆస్కార్ తెర పై జూనియర్ బొమ్మ వేసి మరీ.. ఆస్కార్ అవార్డును ఇస్తే.. కనీసం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ను మెచ్చుకుంటూ ప్రత్యేకంగా ఒక ట్వీట్ అయినా పెట్టాడా ?, తెలుగు దేశం పార్టీ వారైనా ప్రత్యేకంగా ట్వీట్లు పెట్టారా ?, గుంపులో గోవిందా లాగా తారక్ ను చూశారు. ఓ వైపు రామ్ చరణ్ కి అనవసర పబ్లిసిటీ ఇస్తూ చిరంజీవి చరణ్ ను ఆకాశానికి లేపాడు. కానీ, తారక్ ను మాత్రం తెలుగు దేశం పార్టీ అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాబుకు క‌ష్టం వ‌స్తే జూ ఎన్టీఆర్ వచ్చేయాలా ?, అయినా ఇది రాజ‌కీయ ప‌ర‌మైన అంశం.. బాబుకు ఎన్టీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌నే చ‌ర్చ‌ అనవసరం. జూనియ‌ర్ ఎన్టీఆర్ అస‌లు స్పందించక‌పోవ‌డం అతనికి మంచిది కూడా.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -