ఉప్పెన దర్శకుడికి హ్యాండిచ్చిన తారక్!

177
director
- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో, 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఫ్యాన్స్‌కు కిక్‌ ఎక్కించాయి.

అయితే ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా ఓ దర్శకుడు మాత్రం ఎన్టీఆర్ తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అని తెలియక అయోమయంలో పడ్డాడు.ఉప్పెనతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన సత్తా చాటిన బుచ్చిబాబు…తారక్‌తో తెరకెక్కించాలని చాలా గట్టిగానే ప్రయత్నించాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఓ కథను కూడా ఎన్టీఆర్‌కు వినిపించాడు కూడా. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అప్‌డేట్ ఉంటుందని అంతా భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు.

దీంతో బుచ్చిబాబు తన నెక్ట్స్ మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -