‘ఎన్టీఆర్’ డేట్‌ పైనే ఆ ఇద్దరి కన్ను

24
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా వ‌స్తున్న ‘దేవ‌ర’ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. కొర‌టాల శివ ఈ సినిమాను ఓ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఐతే, తాజాగా ‘దేవ‌ర’ సినిమా రిలీజ్ గురించి నెట్టింట ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్పటికే తెలిపారు. కానీ, విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కు స‌ర్జ‌రీ జ‌ర‌గడం, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ఇంకా పెండింగ్ ఉండ‌టం వ‌ల్ల దేవ‌ర సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై మేక‌ర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్‌ ను కొందరు యంగ్ హీరోలు టార్గెట్ చేస్తున్నారు. ఎలాగూ, దేవ‌ర సినిమా ఏప్రిల్ 5 నుంచి వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో.. మిగిలిన టాలీవుడ్ యంగ్ హీరోలు ఆ డేట్‌పై క‌న్నేస్తున్నారు. దేవ‌ర వాయిదా అని అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాగానే ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ చూస్తున్నారు. దేవ‌ర గురించి క్లారిటీ రాగానే టిల్లూ స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్‌లు అనౌన్స్ కాబోతున్నాయి.

ఇంతకీ, ‘దేవ‌ర‌’ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అవుతుందా ?, లేక అనుకున్న డేట్ కే రిలీజ్ అవుతుందా ? చూడాలి. మరోవైపు ‘దేవ‌ర‌’ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట ప్రచార‌మ‌వుతుంది. దేవ‌ర ఇంట‌ర్వెల్‌లో ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ కు సంబంధించిన ఓ స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంద‌ని, ఈ ట్విస్ట్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంద‌ని టాక్. ఇక ‘దేవ‌ర’ త‌ర్వాత ఎన్టీఆర్ షూటింగ్ ప్లానింగ్స్ ఫిక్స్ అయిపోయాయి. ఏప్రిల్ మూడో వారం నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ తో క‌లిసి వార్2 మూవీ షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. దాని త‌ర్వాత దేవ‌ర‌2 కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read:గేమ్ ఆన్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా:రవి కస్తూరి

- Advertisement -