దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు మూడేళ్ల తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటవిశ్వరూపానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. ఈ సినిమాలో ఆయన నటనకు క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో, తారక్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఆలియాభట్‌ను కన్ఫామ్ చేశారు. కానీ ఆమెకు ప్రస్తుతం వివాహం అయినందున ఆమె కాల్ షీట్స్ అందుబాటులో లేవు. దీంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆలియా నటించడం లేదని చెప్పారు. అయితే కొరటాల శివతో చేయనున్న మూవీకి గాను ఎన్టీఆర్ భారీ ఎత్తున పారితోషికం తీసుకోబోతున్నాడని చర్చాంశనీయంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత కాగా.. ఆ మూవీకి తారక్ రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక కొరటాల శివతో చేయనున్న సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా రూ.10 కోట్లు పెంచి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ వల్లే ఎన్టీఆర్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారడట. పాన్ ఇండియా రేంజ్ సినిమా అంటే ఆ మాత్రం రెమ్యునరేషన్ మామూలే. పైగా హిందీ రైట్స్, అటు కన్నడం, ఇటు తమిళంతో పాటు ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగింది. ఇక హిందీ శాటిలైట్ రైట్స్ రేటు కూడా బాగా పెరిగింది. పైగా త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఆ మార్కెట్ అలాగే కంటిన్యూ అయితే ఎన్టీఆర్ మరింత ఎత్తుకు వెళ్లిపోతడం కాయం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోనుంది. ఆలియా తప్పుకోవడంతో ఇంకో హీరోయిన్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తోంది. కొరటాల-తారక్ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి అంటున్నారు అభిమానులు.