యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై యంగ్ టైగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూ.ఎన్టీఆర్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. నేను ప్రస్తుతం నా జీవితంలో చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్‌గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదట నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే ఐదేళ్లు తర్వాత, పదేళ్ల తరువాత ఉంది అని అనుకొనే మనిషిని కాను.. భవిష్యత్ అంటే నా నెక్స్ట్ సెకన్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని.
ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చే పనిగా ఉంది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను అని యంగ్ టైగర్ కుండ బద్దలు కొట్టాడు. టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ తరచూ వినిపించే డిమాండ్ల నేపథ్యంలో దానిపై తారక్ తాజాగా చెప్పిన మాట ప్రాధాన్యం సంతరించుకుంది.