‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ కసరత్తులు

24
- Advertisement -

‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఐతే, ఎన్టీఆర్ ఇంకా వర్కవుట్ చెయ్యాలి అంటున్నారు ‘వార్ 2’ మేకర్స్. ఎన్టీఆర్ ఇటీవలే ముంబై వెళ్లి వచ్చాడు. ముంబైలో ఒక డాక్టర్ వద్ద రెండు వారాల శిక్షణ తీసుకున్నాడు కూడా. గాయాలతో బాధపడుతున్న వారు లేదా కొన్ని రకాల ఎక్సర్ సైజులు చేస్తుంటే నొప్పితో బాధపడేవారికి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడంలో ఈ డాక్టర్ స్పెషలిస్ట్. అందుకే, ఆయన వద్ద రెండు వారాల పాటు ఎన్టీఆర్ ఫిట్నెస్ టెక్నీక్స్ నేర్చుకుని వచ్చారు. అలాగే, పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం కూడా ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రై చేస్తున్నాడు.

అందుకోసం కూడా మరికొన్ని వారాలు పాటు ఎన్టీఆర్ కఠినంగా వర్కౌట్లు చేయనున్నాడు. ఐతే, ఇంతటితో అయిపోలేదు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ మరింతగా కసరత్తులు చెయ్యాలంట. ఇదంతా వార్ 2 చిత్రం కోసమే. ఆ సినిమాలో పోషించే పాత్రకి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ ఫిట్నెస్ సాధించేందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక సాహసిగా కనిపిస్తాడు. ప్రపంచంలోని ఎన్నో కష్టతరమైన ప్రదేశాల్లో హీరో సాహసాలు చేస్తున్నట్లు వార్ 2 మేకర్స్ చూపించనున్నారు.

దానికోసం ఎన్టీఆర్ ఇలా ఫిట్ నెస్ సాధించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటించే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదట వారం తర్వాత మొదలవుతుంది. ప్రస్తుతం వార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులతో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌ కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. ఈ సినిమాకు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా ఈ మూవీ 2025 జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానున్నట్టు స‌మాచారం.

Also Read:ప్రతిపక్షనేతపై కాంగ్రెస్ కక్ష సాధింపు

- Advertisement -