జూ. ఎన్టీఆర్ గోవాకు బయల్దేరారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌లో తారక్ అభిమానుల కెమెరాకు చిక్కారు. ‘దేవర’ పార్ట్-1లోని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని, కాకపోతే ఆ హీరోయిన్ రెండు సీన్లకు మాత్రమే పరిమితమవుతుందని టాక్. దేవర2లో ఆ పాత్ర చాలా కీలకం కానుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక సమాచారం రావాల్సిందే. ఏది ఏమైనా జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో రానున్న వార్2 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ షూటింగ్లో హృతిక్ కూడా పాల్గొన్నాడు. ఈ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ డూప్‌తో పూర్తి చేశారని బాలీవుడ్ వర్గాలు ప్రచారం చేయగా, ఆ వార్తలన్నీ కేవలం రూమర్లేనని తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై కూడా అందరికీ భారీ అంచనాలున్నాయి.
Also Read:ఆస్తమా ఉందా..అయితే జాగ్రత్త!