బాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ దూరం

71
- Advertisement -

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ తో పాటు టాలీవుడ్ తెలుగు తమ్ముళ్లు, చంద్రన్న సన్నిహితులు, ఫాలోవర్లు అందరూ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. సరే జూనియర్ సంగతి పక్కన పెడితే.. మిగతావారు కూడా నోరు మెదపడం లేదు. నిజమే బయపెట్టేవాడికే సమాజం తలవంచుతుంది అని నేడు మన సినీ ప్రముఖులు రుజువు చేస్తున్నారు. ఏపీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తోందా ? గ్యారంటీ లేదు. ఒకవేళ మళ్లీ జగనే గెలిస్తే.. ఏమిటి పరిస్థితి ?.

జగన్ పగ బడితే.. ఏపీ బాక్సాఫీస్ దగ్గర తమకు పుట్టగతులు ఉండవు అని రీల్ హీరోలుగా చెలామణి అయ్యే స్టార్స్ అందరూ ప్రస్తుతం మెతక వైఖరిని అనుసరిస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప.. ఏ స్టార్ నోరు తెరవలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సినీ ప్రముఖులు కూడా మనకెందుకులే అని నిద్ర నటిస్తున్నారు. రాఘవేంద్ర రావు, నట్టి కుమార్ తప్ప.. యావత్ తెలుగు సినీ పరిశ్రమ చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. సరే ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వద్దాం. ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు ?, దీనికి సమాధానం అభిమానులు కాదు, బాలకృష్ణ, చంద్రబాబు మరియు వారి కుటుంబ సభ్యులే చెప్పగలరు.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి. జరుగుతూనే ఉంటాయి. పలకరించినా పలకరించకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడు, వెళ్తూనే ఉన్నాడు. కనీసం మీడియా ముందు అయినా, బాలకృష్ణ – చంద్రబాబు లాంటి వారు జూనియర్ కి మర్యాద ఇచ్చి దగ్గరకు తీసుకుని ఉండి ఉంటే.. కచ్చితంగా నేడు జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చేవాడే. ఏదో రాజకీయ వారసత్వం కోసం జూనియర్ అలగలేదు. కనీసం మనిషి లాగా కూడా చూడని వ్యక్తుల కోసం తాను ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవాలి ?, 2014 లో అధికారంలోకి వచ్చాక, ఇదే జూనియర్ ఎన్టీఆర్ కు కనీసం ఏ ఆహ్వానం అందలేదు. ప్రమాణ స్వీకారానికి కూడా పిలిచి.. ఎక్కడో స్టేజ్ కింద 20 వ వరుసలో కూర్చో పెట్టారు. అప్పటికే ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ఏ కష్టం చేయని వ్యక్తులను కూడా స్టేజ్ మీదకు కూర్చో పెట్టారు. ఇలా ఒక్కటి కాదు, ఎన్నో ఎన్నెన్నో. అందుకే.. జూనియర్ దూరంగా ఉన్నాడు.

Also Read:పిక్ టాక్ : హాట్ ట్రీట్‌తో నెట్టింట హీటు

- Advertisement -