నవదీప్ కు చుక్కలు చూపించిన ఎన్టీఆర్

221
navdeep-with-ntr_
- Advertisement -

తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ఈ షో ఇప్పటికే పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరో నవదీప్‌ను హోస్ట్ ఎన్టీఆర్ సరదాగా ఆటపట్టించారు.  ‘నవదీప్ మీ ఇంట్లో 500, 1000 రూపాయల పాత నోట్లు దొరికాయట… నిన్ను విచారణకు రమ్మంటున్నారు. ఐదు నిమిషాల టైమ్ ఇస్తున్నాను, వెంటనే బయటకు రా’ అంటూ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, నవదీప్ ను ఆటపట్టించాడు.

దీంతో అది నిజమేనని నమ్మిన నవదీప్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఇంట్లోకి లేటెస్ట్‌గా ఇచ్చిన వ్యక్తి కావడంతో ఇతర కంటెస్టెంట్లు విశేషాలు అడుగుతారు. రద్దయిన పాత 500, 1000 నోట్లు చెల్లుతున్నాయని చెప్పడమే కాదు, వారిని నమ్మించిన విషయం తెలిసిందే. ‘హౌస్ సభ్యులకు నువ్వు కథలు చెప్పావు కదా. కథలు చెప్పడం నీకు మాత్రమే వచ్చా. మాకు కూడా వచ్చునంటూ’ ఎన్టీఆర్ చెప్పగానే ఇతర కంటెస్టెంట్లు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్’ రియాల్టీ షో శనివారం మరింత రసవత్తరంగా సాగింది.

షోను హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంటి సభ్యులతో కుర్చీలాట ఆడించారు. అనంతరం కామెడీ స్కిట్లు చేయించారు. డిఫరెంటుగా సాగిన ఈ ఆట, కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. కుర్చీలాటలో అర్చన గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆమెకు బిర్యానీ గిఫ్టుగా ఇచ్చాడు. దాన్ని ముగ్గురితో మాత్రమే పంచుకోవాలని నిబంధన విధించగా, ముమైత్, హరితేజ, నవదీప్‌లతో బిర్యానీ షేర్ చేసుకుంది.

- Advertisement -