Jr NTR:దేవర టీజర్ వచ్చేస్తుందోచ్?

31
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రెల్ 5 న విడుదల చేయనున్నారు. ” ఆర్ ఆర్ ఆర్ ” తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో దేవర పై ఇండియన్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా కమర్షియల్ మూవీగా కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్టర్స్ మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. .

ఇక టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ మొదట సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఇంకా ముందుగానే టీజర్ విడుదల చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం క్రిస్మస్ కానుకగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక ఆ తర్వాత నుంచి ఏప్రిల్ వరకు నెలకో అప్డేట్ ఇచ్చే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ‘జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే కొరటాల గత చిత్రం ఆచార్య బెగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మరి భారీ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో కాంబినేషన్ రిపీట్ చేసీన కొరటాల ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో హిట్ ఇస్తాడేమో చూడాలి.

Also Read:రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -