సత్తా చాటిన ఎన్టీఆర్..దేవర!

5
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాగా వర‌ల్డ్ వైడ్‌గా రూ.304 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌తో 80 శాతం రిక‌వ‌రీ సాధించింది దేవర. తొలి రోజు రూ.172 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించగా మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్‌, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లోనూ రిలీజ్ అయింది.

Also Read:పొరపాట్లు లేకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు!

- Advertisement -