‘ఆర్ఆర్ఆర్’ నుండి అదిరిపోయే అప్‌డేట్‌..

45

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈమేరకు చిత్రం బృందం ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రాంచరణ్, తారక్ లుక్స్‌కి సంబంధించి కొత్త స్టిల్స్ విడుదలయ్యాయి. పోలీస్ గెటప్‌లో రాంచరణ్, బ్లూ షర్ట్-ధోతీ గెటప్‌లో ఎన్టీఆర్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్, భీమ్ పాత్రలకు సంబంధించిన ఈ స్టిల్స్‌ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ ఖాతాలో ఈ స్టిల్స్‌ను పోస్ట్ చేశారు.

ప్రమోషన్స్ మొదలుపెట్టిన తరువాత బయటికి వచ్చిన వాటిలో ఇవి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ గా చెప్పుకోవచ్చు. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన టీమ్, నిన్న చెన్నైలోను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించారు.