బీజేపీ నూతన అధ్యక్షుడిగా జేపీ నడ్డా

428
jp nadda
- Advertisement -

నేడు బీజేపీకి నూతన సారధి ఎన్నిక జరుగనుంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2.30గంటలకు బీజేపీ ఎన్నికల అధికారి రాధామోహన్ సింగ్ ప్రకటించనున్నారు. ఉదయం 10.30గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.

ఈ పదవికి జేపీ నడ్డా తప్ప మరెవరు నామినేషన్ వేయలేదు. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగుతున్నారు. అయితే అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో పార్టీ పగ్గాలను నడ్డాకు అప్పగించనున్నారు.

- Advertisement -