బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

342
jpnaddat
- Advertisement -

భారతీయ జనతా పార్టీ జాతీయ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మరికాసేపట్లో బీజేపీ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసందర్భంగా నడ్డాకు ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు అభినందనలు తెలిపారు. కాగా ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా పదవి కాలం ముగియడంతో నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరునెలల క్రితం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

- Advertisement -