ఇప్పడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోనే 2012, మార్చి 23న విడుదలై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీరిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్‌సెట్టర్ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై క్రియేటివ్ దర్శకుడు మారుతీ డైరెక్షన్లో వచ్చిన సినిమా ‘ఈ రోజుల్లో’. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జేబి సంగీతం అందించాడు. ఎస్‌కేఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం రేపు విడుదల కానున్న సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ సినిమా విడుదలైన 12 సంవత్సరాల తరువాత మళ్లీ ఈ సినిమాను రీరిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. చాలా చిన్న బడ్జెట్‌తో సరదాగా చేసిన సినిమా ఇది. మా జీవితాలను మార్చిన సినిమా ఇది. గత 12 సంవత్సరలుగా మా ముగ్గురి జర్ని కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా వుంటుంది. అందుకే ఎస్‌కేఎస్, శ్రీనివాస్ పూనుకుని ఈ సినిమా స్వీట్ మొమరీస్‌ను అందరికి గుర్తు చేస్తే బాగుంటుందని ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా మళ్ళీ ఇప్పడు బిగ్ స్కీన్‌పై చూసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
మా లైఫ్‌లు టర్న్ చేసిన సినిమా ఇది. ఈ స్వీట్ మొమెరీని అందరూ మరోసారి గుర్తు చేసుకుని సినిమాను చూసి మళ్లీ ఆనందించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఎస్‌కేఎన్ మాట్లాడుతూ మా ముగ్గురి కెరీర్‌లో ఇది చాలా ప్రత్యకమైన సినిమా. పీఆర్ ఓగా వున్న నన్ను నిర్మాతను చేసిన సినిమా ఇది. మా అందరిని బిజీ చేసిన ట్రెండ్‌సెట్టర్ సినిమా ఇది. తెలుగు సినీ పరిశ్రమకు మారుతి లాంటి ప్రతిభ గల దర్శకుడిని అందించిన సినిమా ఈ రోజుల్లో. ఆ రోజున మొదలైన మా ప్రయాణంలో అందరికి మంచి కెరీర్‌ను ఇచ్చిన సినిమా ఇది. ఈ రోజుల్లో నుంచి బేబీ వరకు నిర్మాతగా నాప్రయాణం, దర్శకుడిగా మారుతి ప్రస్థానం, శ్రీనివాస్ కెరీర్ ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇది కేవలం రిరిలీజ్ మాత్రమే కాదు. పుష్కర కాలంలో మా కెరీర్‌లో ఎలా ఎదిగాం అని చూసుకునే తీపి గుర్తు ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన తరువాత సినీ పరిశ్రమలో 50 లక్షలతో ఎలా సినిమా తీశారు.. అంటూ మా ప్రతిభను గుర్తించారు. ఎంతో మంది వాళ్ల సహకారం అందించారు. ఇలాంటి సినిమా మళ్లీ వెండితెరపై చూసుకోవడం ఆనందంగా వుంది అన్నారు. నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది మా ముగ్గురి ఎమోషనల్ జర్ని, కేవలం 50 లక్షలతో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దర్శకుడు మారుతి అప్పట్లోనే కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి ఈ సినిమా తీశాడు. మా ప్రమోషన్‌తో సినిమాను మరింత జనాల్లోకి తీసుకవెళ్లాం. ఈ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇలాంటి స్వీట్ మెమెరీస్ గుర్తు చేసుకుంటూ ఈసినిమా ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకరావడం సంతోషంగా వుంది అన్నారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..