‘రిపబ్లిక్‌’.. జోర్ సే సాంగ్ దుమ్ములేపిన మెగా హీరో..

113
sai tej
- Advertisement -

మెగా హీరో సాయి తేజ్‌ ప్రస్తుతం ‘రిపబ్లిక్‌’ అనే మూవీలో నటిస్తున్నాడు. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను భగవాన్ – పుల్లారావు కలసి నిర్మిస్తున్నారు, ఈ చిత్రం ఇప్పటికి పూర్తై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా .. ” అంటూ ఈ పాట సాగుతున్న ఈ పాటను మణిశర్మ స్వరపరిచారు. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో సాయి తేజ్‌ అదరగొట్టే డాన్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా.. డాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. యూత్ పై మంచి ఉత్సాహభరితమైన స్టెప్స్ ను ఆయన కంపోజ్ చేశాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయితేజ్ ముచ్చట ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. మణిశర్మ సంగీతాన్ని అందించారు.

- Advertisement -