ఆకట్టుకుంటున్న ‘బీస్ట్’ సెకండ్‌ సాంగ్‌..

161
- Advertisement -

తమిళ సూపర్‌ స్టార్ విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’. ఈ మూవీ నుంచి తాజాగా మరో పాట విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌ను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు చిత్రం బృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను వదిలారు.

‘జాలీ ఓ జింఖానా’ అంటూ సాగే ఈ సాంగ్‌లో విజయ్, పూజాహెగ్ధే స్టెప్పులు అఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను హీరో విజయ్ పాడడం విశేషం. ఈ పాటకి కార్తిక్ లిరిక్స్ అందించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘అరబిక్ కుతు’ సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సెకండ్ సింగిల్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

- Advertisement -