టీడీపీ మెంబర్‌షిప్‌@100

3
- Advertisement -

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26ను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ సభ్యులకు విద్యా, ఉద్యోగ, వైద్య సహాయం అందుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది అన్నారు.

సభ్యత్వం తీసుకోండి.. టిడిపి కార్యకర్తను అని ఘనంగా చాటండి.కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని వెల్లడించారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా కూడా సభ్యత్వం తీసుకొవచ్చు. రూ. లక్ష కడితే జీవతకాల సభ్యత్వాన్ని ఇస్తారు.

Also Read:జీవన్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి

- Advertisement -